ఎల్‌నినో వచ్చినా నో టెన్షన్.. రెండేళ్లకు సరిపడా సన్నబియ్యం ఉన్నయ్: సీఎం రేవంత్ 

ఎల్‌నినో వచ్చినా నో టెన్షన్.. రెండేళ్లకు సరిపడా సన్నబియ్యం ఉన్నయ్: సీఎం రేవంత్ 

రాష్ట్రంలో రెండేళ్లకు సరిపడా సన్నబియ్యం నిల్వలు ఉన్నాయని, ఎల్‌నినో ప్రభావం ఎదురైనా ప్రజలకు ఆహార భద్రత విషయంలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైటెక్స్‌లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో–2026ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన...ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కోడిగుడ్లు అందించేందుకు పౌల్ట్రీ పరిశ్రమ సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. పేద పిల్లలకు పోషకాహారం అందించడంలో పౌల్ట్రీ రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు.  పౌల్ట్రీ పరిశ్రమ రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు యువతకు అవసరమైన ప్రోటీన్‌ను అందిస్తోందని సీఎం అన్నారు

పౌల్ట్రీ పరిశ్రమ అనేక ఒడిదుడుకులు, సంక్షోభాలను ఎదుర్కొంటోందని, అలాంటి సమయాల్లో ప్రభుత్వం పరిశ్రమకు అండగా నిలుస్తుందని సీఎం హామీ ఇచ్చారు. పరిశ్రమకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పౌల్ట్రీ రంగంలో పెట్టుబడులు, అభివృద్ధికి అవసరమైన అనుమతులను సింగిల్ విండో విధానం ద్వారా వేగంగా మంజూరు చేస్తామని చెప్పారు.పౌల్ట్రీ రంగం వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా మాత్రమే కాకుండా రైతులకు ఆదాయం, ప్రజలకు పోషకాహారం, యువత ఆరోగ్యానికి అవసరమైన ప్రోటీన్ అందించే కీలక రంగంగా ఎదిగిందని సీఎం అభిప్రాయపడ్డారు. పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు, రైతులు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ALSO READ : పౌల్ట్రీ పరిశ్రమకు శాశ్వత పరిష్కార వ్యవస్థ.